మళ్లొచ్చేది గులాబీ జెండానే అని స్పష్టం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 24 గం. లు కరెంట్ ఇచ్చినట్టే.. 24 గంటలు మంచినీళ్లు కూడా ఇచ్చే బాధ్యత మాదే..మా ఆడబిడ్డలకు మాట ఇస్తున్నా అన్నారు. కూకట్ పల్లిలో జరిగిన బీఆర్ఎస్ శ్రేణుల సమావేశంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓట్ల సవరణ కార్యక్రమంపై కేటీఆర్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.
కాంగ్రెస్, బీజేపీ నమోదు చేసిన దొంగ ఓట్ల పైన ప్రత్యేక శ్రద్ధ వహించాలి.. దీంతోపాటు ఏ ఒక్కరి ఓటు కూడా పోకుండా పార్టీ శ్రేణులు ప్రజలకు అండగా ఉండాలని కోరారు. దీనికోసం ప్రతి బూత్ నుంచి తగిన ప్రణాళికతో ముందుకు పోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ దద్దమ్మల పాలనలో హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా కుప్పకూలిపోయింది.. లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులకు, సెంట్రింగ్ కార్మికులకు ఉపాధి పోయింది…మీరు అధైర్యపడొద్దు.. ధైర్యంగా ఉండండి అన్నారు.
మళ్లీ రాబోయేది కేసీఆర్.. గులాబీ జెండానే..మీకు బీమాతో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం.. మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాం.. మీకు అండగా నిలుస్తాం… హైదరాబాద్ నగరంలో రెండున్నర లక్షల మంది పేదలకు ఇండ్ల పట్టాలిచ్చిన మనసున్న నాయకుడు కేసీఆర్ .. ఇందిరమ్మ రాజ్యమంటూ..గద్దెనెక్కి పేదల ఇండ్లను కూలుస్తూ..వారి బతుకులను రేవంత్ రోడ్డున పడేస్తున్నారని ఆరోపించారు.
ALso Read:అస్సాం అసెంబ్లీలో UCC బిల్!

