ఆధారాలు ఉంటే కోర్టులో పెట్టాలి:కేటీఆర్

14
- Advertisement -

ఏదైనా విషయం ఇల్లీగల్ అని చెప్పడానికి పక్కా ఆధారాలు ఉంటే, వాటిని సోషల్ మీడియాలో ట్వీట్లు చేయకుండా నేరుగా కోర్టులో పెట్టాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేయడం, లీకులు ఇవ్వడం బాధ్యతాయుతమైన అధికారుల ప్రవర్తన కాదని ఆయన విమర్శించారు.

“సజ్జనార్ ఏమైనా ఈ మధ్యలో జడ్జ్ అయ్యాడా?” అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. విచారణ కొనసాగుతున్న అంశాలపై ముందుగానే తీర్పులు చెప్పే ధోరణి ప్రమాదకరమని అన్నారు. చట్టం ప్రకారం న్యాయస్థానాలే తుది నిర్ణయం తీసుకుంటాయని, అధికారుల పని దర్యాప్తు చేయడమే తప్ప తీర్పులు చెప్పడం కాదని గుర్తుచేశారు.

అత్యుత్సాహంతో వ్యవహరించడం అధికారులకు మంచిది కాదని హెచ్చరించిన కేటీఆర్, ఇటువంటి చర్యలు ప్రజల్లో గందరగోళం సృష్టించడమే కాకుండా న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తాయని అన్నారు.

Also Read:సజ్జనార్‌పై హరీశ్‌రావు సీరియస్

- Advertisement -