KTR:యువకుల మృతి కలిచివేసింది

12
- Advertisement -

రామంతాపూర్‌ గోకులేనగర్‌లో శ్రీకృష్ణాష్టమి ఊరేగింపులో జరిగిన దుర్ఘటన అత్యంత విషాదకరమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. కరెంట్ షాక్ తగిలి ఐదుగురు యువకులు మృతిచెందడం తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు.

పండుగ వేళ జరిగిన ఈ దుర్ఘటన చాలా బాధాకరమని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

 

Also Read:గాలిలో విమానం..మంటలు!

- Advertisement -