ఎన్టీఆర్‌ను కావాలనే టార్గెట్ చేశారా?

5
- Advertisement -

జూనియర్ ఎన్టీఆర్‌ను బూతులు తిట్టిన అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఒకే రోజు రెండు భారీ సినిమాలు కూలి, వార్ 2 రిలీజ్ అయ్యాయి. ఒక సినిమాకు మద్దతు, ఇంకో సినిమాపై దాడి చేస్తూ టీడీపీ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ అసలు వివాదానికి కేరాఫ్ అడ్రస్‌గా మారాయి.

డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న పవన్ కల్యాణ్ సినిమా హరిహర వీరమల్లు సినిమాకు హద్దులు మీరి ప్రజా ప్రతినిధులు చేసిన ప్రమోషన్లు జరిగాయో చూసాం…మరి జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమాను పని కట్టుకొని నెగిటివ్ ప్రచారం చేయడం వెనక అంతర్యం ఏంటి? చెప్పాలని మండిపడుతున్నారు.

గతంలో మీరే కదా వైసీపీ కావాలనే పవన్ కళ్యాణ్ సినిమాలను అడ్డుకుంటుంది అని ఆరోపణలు చేసింది, ఇప్పుడు అదే పని కూటమి నేత చేస్తుంటే మౌనం ఎందుకని ప్రశ్నిస్తున్న నందమూరి అభిమానులకు మీ సమాధానం ఏంటి? చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకప్పుడు చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి అవమానం జరిగినప్పుడు నందమూరి కుటుంబం అంతా ఏకమై, ప్రెస్ మీట్ పెట్టి ఆ ఘటనను తీవ్రంగా ఖండించారు. మరి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తల్లిని ఎవరో దూషిస్తే ఎందుకు అదే కుటుంబం కిక్కురుమనకుండా ఉంది?..భువనేశ్వరికి ఒక న్యాయం… జూనియర్ ఎన్టీఆర్ తల్లికి వేరే న్యాయమా? చెప్పాలని దుయ్యబడుతున్నారు.

Also Read:తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు..

- Advertisement -