అవయవదానానికి ముందుకు వచ్చిన కేటీఆర్..

3
- Advertisement -

అసెంబ్లీ సాక్షిగా అవయవ దానానికి ముందుకు వచ్చారు కేటీఆర్. అవయవదానం బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా సభలో తాను అవయవ దానానికి సిద్ధంగా ఉన్నట్లు కెటిఆర్ ప్రకటించారు. మనం లక్షలాది మంది ప్రజలకు ప్రతినిధులం. మనం అందరికీ ఆదర్శంగా నిలవాలన్నారు.

మన నియోజకవర్గాల్లో కూడా అవయవదానం అంశంలో చైతన్యం తీసుకురావాలి… ప్రజలందరికీ దీనిపై అవగాహన కల్పించాలన్నారు. ఈ మేరకు ఆలోచన ఉన్న సభ్యులు ముందుకు వస్తే శాసన సభ ప్రాంగణంలోనే సంతకాల సేకరణ చేపడదామని స్పీకర్ కు సూచించారు. అందరి కంటే ముందు తానే సంతకం చేస్తానని సభలో ప్రకటించారు కేటీఆర్.

అవయవ దానం అనేది గొప్ప మానవీయ చర్య. ఇది మరింత మందికి జీవితాన్ని ప్రసాధిస్తుందని కెటిఅర్ అన్నారు.

Also Read:అవయవదానం..అగ్రస్థానంలో తెలంగాణ నిలిపాం: హరీష్ రావు

- Advertisement -