పోలవరం ప్రాజెక్ట్ గురించి 1940లో అనుకుని 1980లో శంకుస్థాపన చేస్తే.. ఇప్పుడు 2027 డిసెంబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్‌లో కాళేశ్వరం డాక్యుమెంటరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. అదే కేసీఆర్ 2016లో కాళేశ్వరం శంకుస్థాపన చేస్తే 5, 6 ఏండ్లు తిరగకుండానే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేశారు అన్నారు. కేసీఆర్ పనితనానికి ఇతర రాష్ట్రాల పనితనానికి తేడా ఏందో చెప్పడానికి నేను ఇది చెప్తున్నాను అన్నారు కేటీఆర్.
కాళేశ్వరం మీద ఈ చెత్త కాంగ్రెస్, ఉత్త కాంగ్రెస్ నాయకులు చేసే దుష్ప్రచారం కాదు..దీని వెనకాల మీడియా అనే స్లాటర్ హౌస్‌లు నడిపే యజమానులు వారి యజమానులు ఉన్నారు అన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కాళేశ్వరంతో మాకు నష్టం జరుగుతుందని, బనకచర్లకు అడ్డం అవుతుందనే కుట్రదారుల డైరెక్షన్‌లో ఈ దుష్ప్రచారం జరుగుతుంది అన్నారు జగదీష్ రెడ్డి.
రైతాంగాన్ని కేసీఆర్ నుండి దూరం చేసే కుట్ర జరుగుతుంది…గింతున్న రేవంత్‌కు కాళేశ్వరంను వ్యతిరేకించే శక్తి లేదు.. దీని వెనుక దుర్మార్గమైన కుట్ర ఉంది..బనకచర్ల కట్టాలన్న కుట్రదారుల డైరెక్షన్‌లోనే.. కాళేశ్వరంపై అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి.. మీడియా ముసుగులో కొన్ని స్లాటర్ హౌసులు నడుపుతున్న వాళ్ల కుట్ర ఇది అన్నారు.
Also Read:కిష్కింధపురి..అందరూ చూడాల్సిన చిత్రం!

