కేసీఆర్‌ ఆరోగ్యంగానే ఉన్నారు: కేటీఆర్

7
- Advertisement -

కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ అప్‌డేట్ ఇచ్చారు మాజీ మంత్రి కేటీఆర్. ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన కేటీఆర్.. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు నిన్న సాయంత్రం సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రిలో చేరారు. రక్తంలో చక్కెర స్థాయి మరియు తక్కువ సోడియం స్థాయిని పర్యవేక్షించేందుకు డాక్టర్లు కొద్ది రోజుల పాటు ఆసుపత్రిలో ఉండమని సూచించారు అని తెలిపారు.

ఏవిధమైన గంభీరమైన ఆరోగ్య సమస్యలు లేవు… ఆయన అన్ని ముఖ్యమైన జీవక్రియల విలువలు (వైటల్స్) సాధారణంగా ఉన్నాయి అన్నారు. అయన ఆరోగ్యం గురించి ఆరా తీసిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు.

Also Read:తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నాం:UV క్రియేషన్స్

- Advertisement -