తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నాం:UV క్రియేషన్స్

7
- Advertisement -

ఒక అనామక వ్యక్తి తాను UV క్రియేషన్స్‌కు చెందినవాడినంటూ నటీమణులను, వారి ప్రతినిధులను తప్పుడు ఆఫర్లతో కలిసేందుకు ప్రయత్నిస్తున్నాడని మా దృష్టికి వచ్చింది.

ఈ వ్యక్తితో మా సంస్థకు ఎలాంటి సంబంధం లేదు. UV క్రియేషన్స్ తరఫున వచ్చే అన్ని అధికారిక సమాచారం, కాస్టింగ్ ప్రక్రియలు నమ్మదగిన, సరైన మార్గాల ద్వారా మాత్రమే జరుగుతాయి.

ఈ విషయాన్ని పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్కరు జాగ్రత్తగా గమనించాలని, ఎవ్వరైనా ఈ తరహా అనామక ప్రతినిధులతో ముందుకు వెళ్లేముందు తప్పకుండా నిజం తెలుసుకోవాలని మనవి. మాకు ఏ అవసరాలు ఉన్నా లేదా కాస్టింగ్ కాల్స్ ఉన్నా, అవి అధికారికంగా, నమ్మదగిన వనరుల ద్వారా మాత్రమే తెలియజేస్తాం.

మా పేరు, బ్రాండ్‌ను దుర్వినియోగం చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయంలో చర్యలు తీసుకుంటున్నాం అని యువీ క్రియేషన్స్ తెలిపింది.

Also Read:KTR:తీరని ద్రోహం చేసిన కాంగ్రెస్

- Advertisement -