HCU భూములలో క్విడ్ ప్రోకో: కేటీఆర్

15
- Advertisement -

HCU భూములలో క్విడ్ ప్రోకో జరిగిందన్నారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. HCU భూముల కుంభకోణంలో రేవంత్ రెడ్డికి ఒక బీజేపీ ఎంపీ సహకరించాడు.. నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఆ బీజేపీ ఎంపీ పేరు బయట పెడతానన్నారు. HCU కంచ గచ్చిబౌలి భూముల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న స్కామ్ మీద విచారణ చేయాలని RBI, CBI, CVC, SFIO, SEBIకి ఆధారాలతో సహా లేఖ రాశారు కేటీఆర్.

రేవంత్ రెడ్డి ట్రస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అనే కంపెనీకి రూ.170 కోట్లు లంచం ఇచ్చాడు.. రేవంత్ రెడ్డి RBI గైడ్‌లైన్స్‌ని కూడా తుంగలో తొక్కాడు అని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఈ HCU భూములను అమ్మడానికి కోర్టు తీర్పు రాగానే TGIICకి బదిలీ చేశాడు కానీ మ్యుటేషన్ చేయలేదు అన్నారు.

రేవంత్ రెడ్డి భూముల రేట్లు మార్చి, లేని వాల్యూను ఉన్నట్లు చూపించి RBIని మిస్ లీడ్ చేసి స్కాం చేశాడు అని ఆరోపించారు. తనది కాని భూమిని TGIICతో తాకట్టు పెట్టి, రేవంత్ రెడ్డి రూ.10000 కోట్లు తెచ్చుకొని RBI గైడ్‌లైన్స్‌ని తుంగలో తొక్కాడు అన్నారు.

HCU భూములు అడవి భూములు.. అడవికి ఉండే 0.4 క్యానపి లక్షణాలు ఉంటే అది ఎవరి భూమి అయినా అటవీ భూమి అవుద్దని 1996లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి ఒక బీజేపీ ఎంపీ సహకారంతో ట్రస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే బ్రోకర్ కంపెనీతో కుమ్మక్కై HCU భూములు అమ్మాలని చూశారని దుయ్యబట్టారు.

Also Read:సామాజిక విప్లవకారుడు మహాత్మా ఫూలే

- Advertisement -