హైదరాబాద్ నగరం నకిలీ ఏరోస్పేస్, రక్షణ రంగానికి చెందిన షెల్ కంపెనీలకు కేంద్రంగా మారుతోందంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి సంస్థల వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఈ వహారాలపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆయన బృందం దృష్టి సారించి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
రేవంత్ కుటుంబానికి చెందిన ‘టెసరాక్ట్’ అనే ఏరోస్పేస్ కంపెనీని ప్రస్తావించిన విమర్శకుడు.. ఆ తర్వాత పొంగులేటి కుటుంబానికి చెందినదిగా చెబుతున్న ‘రాఘవ ఏరోస్పేస్’ పేరును ప్రస్తావించారు. తాజాగా ‘ఐంద్రి డిఫెన్స్’ అనే సంస్థపైనా ఆరోపణలు చేశారు. ఈ సంస్థలన్నింటినీ షెల్ కంపెనీలుగా అభివర్ణిస్తూ, వాటి కార్యకలాపాలపై అనుమానాలు వ్యక్తం చేశారు.
దేశ రక్షణ రంగానికి అవసరమైన పరికరాలను సరఫరా చేసే సంస్థల విశ్వసనీయత అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి సంస్థలే సైన్యానికి పరికరాలు అందిస్తే దేశ సాయుధ దళాల భద్రతను దేవుడే కాపాడాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఈ నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆయన బృందం సంబంధిత సంస్థలపై దృష్టి సారించి, వాటి నేపథ్యం, కార్యకలాపాలు, రక్షణ రంగంతో ఉన్న సంబంధాలపై సమగ్రంగా పరిశీలించాలని కోరారు.
Of late, under the Congress Govt Hyderabad seems to be acquiring the dubious distinction of being the Hub for fake Aerospace & Defence shell companies
First Anumula Family’s shell aerospace company “Tesseract”
Second Ponguleti family “Raghava aerospace”
Now “Aindri defense”
God only can save India’s armed forces if these are the kinds that supply equipment
Can the defense minister @rajnathsingh and his team look into these shell companies?
— KTR (@KTRBRS) October 16, 2026
Also Read:కాంగ్రెస్ అరాచకం..రాజ్‌నాథ్ ఫైర్

