- Advertisement -
దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంపై సమీక్షించుకుంటామని మంత్రి కేటీఆర్ అన్నారు. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలు వెల్లువడిన అనంతరం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ 2014 జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలో వచ్చిన ఏ ఎన్నిక అయినా టీఆర్‌ఎస్ అణితరసాధ్యమైన విజయాలు నమోదు చేసిందన్నారు. విజయాలకు పొంగిపోము.. అపజయాలకు కుంగిపోము అన్నారు.
దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటేసిన ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. దుబ్బాక ఫలితం మేం ఆశించినవిధంగా ఫలితం రాలేదని చెప్పుకొచ్చారు. ఆరున్నరేళ్లలో టీఆర్ఎస్ ఎన్నో విజయాలు నమోదు చేసుకుందని గుర్తుచేశారు. దుబ్బాక తీర్పును లోతుగా సమీక్షించుకుంటామని కేటీఆర్ వెల్లడించారు. దుబ్బాక ఫలితాలు మా పార్టీ నేతలను అప్రమత్తం చేసినట్టు భావిస్తున్నాము. మాకు ఓటు వేసిన 62వేల పైచిలుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు మంత్రి కేటీఆర్.
- Advertisement -