కళ్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి..

286
Minister Koppula
- Advertisement -

ముఖ్యమంత్రి కెసిఆర్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి, సమున్నతికి పెద్ద పీట వేశారని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు నిరాఘాటంగా కొనసాగుతుండడమే కెసిఆర్ సుపరిపాలనకు ప్రజల నిదర్శనమన్నారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలానికి చెందిన 104మంది కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ లబ్ధిదారులకు మంగళవారం రూ.1,04,12,064 కోట్ల విలువగల చెక్కులను లబ్ధిదారులకు అందించిన మంత్రి కొప్పుల ఈశ్వర్.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కెసిఆర్ కళ్యాణలక్మీ, షాధీముబారక్ పథకాలను ప్రవేశపెట్టి పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు కొండంత అండగా నిలిచారన్నారు. దీంతో బాల్యవివాహాలనేవి జరగడం లేదని, అమ్మాయిలు చక్కగా చదువుకుంటున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు,సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

అనంతరం పెగడపల్లి మండలం ఐతుపల్లి గ్రామానికి చెందిన వి.లక్ష్మారెడ్డి అనారోగ్యంతో బాధపడుతు చికిత్స చేసుకోలేని పరిస్థితిలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కలువగా వారి ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని లక్ష రూపాయల LOC లబ్ధిదారు కుటుంబానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ అందజేశారు.

- Advertisement -