రేవంత్..టూరిస్ట్ సీఎం:కేటీఆర్

7
- Advertisement -

హస్తిన యాత్రలో అర్ధశతకం సాధించిన రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ రాష్ట్రాన్ని ఫైల్స్‌తో కాకుండా… ఫ్లైట్ బుకింగ్స్‌తో నడిపిస్తున్న రేవంత్ రెడ్డి..ఈయన ఢిల్లీ యాత్రలకు .. తెలంగాణకు ఏ సంబంధం లేదు….కాంగ్రెస్ పాలన చేపట్టాక రేవంత్ చేసిన మూడు పనులు ఇవేనని ఎద్దేవా చేశారు.:

మొదటి పని – ఫ్లైటు టికెట్ బుక్ చేయడం!

రెండో పని – ఢిల్లీకి పోవడం!

మూడో పని – ఖాళీ చేతులతో తిరిగి రావడం!

రైతన్నలు ఇబ్బందులను తట్టుకుని పండించిన పంటలకు మార్కెట్లో మద్దతు ధర లేదు .. రైతులు పొలాల్లో జల్లడానికి యూరియా లేదు…సాగునీళ్లు రావు .. తాగునీళ్లు లేవు … కాళేశ్వరం ఎత్తిపోతల మరమ్మతు పనులు జరగకుండా అడ్డుకుంటూ తెలంగాణకు ద్రోహం చేస్తున్నామన్న సోయి లేదు..బనకచర్ల నిర్మాణంతో తెలంగాణ శాశ్వతంగా నష్టపోతుందన్న ఆలోచన లేదు..రెండు లక్షల ఉద్యోగాల ఊసు లేదు .. జాబ్ క్యాలెండర్ల జాడ లేదు అన్నారు.

రుణమాఫీ కాలేదు- రైతు భరోసా రాలేదు…తులం బంగారం ఊసు లేదు .. రూ.4 వేల ఫించన్ జాడ లేదు…గురుకులాల గోడు పట్టదు – గురుకుల విద్యార్థుల ఆకలి కేకలు వినపడడం లేదు…కానీ రేవంత్ రెడ్డి 3 రోజుల్లో 3 ఫ్లైట్‌లు ఎక్కుతున్నాడు .. దిగుతున్నాడు…“ఒక్కసారి కాదు… రెండు సార్లు కాదు…50 సార్లకు చేరిన హస్తిన యాత్ర..కానీ తెచ్చింది ఏమీ లేదు!,శుష్కప్రియాలు .. శూన్య హస్తాలు ,అయిననూ పోయి రావలె హస్తినకు అని చురకలు అంటించారు.

కానీ ఢిల్లీ యాత్రలతో మన రాష్ట్రానికి వచ్చిందేమిటి?? .. నో ప్రాజెక్ట్, నో ఫండింగ్, నో ప్యాకేజీ…నికి బదులు దక్కింది మాత్రం… ఫోటో షూట్లు, వీడియోలు , విందు రాజకీయాలు! ..రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి కావాలి ..ఢిల్లీకి యాత్రలు చేసే టూరిస్ట్ సీఎం కాదు అన్నారు.

Also Read:జాతీయ ఉత్తమ చిత్రం..12th Fail

- Advertisement -