బుల్డోజర్లతో కూల్చడమే అభివృద్ధా: కేటీఆర్

16
- Advertisement -

అభివృద్ధి అంటే భూములను చెరబట్టడం.. బుల్డోజర్లను ఉసిగొల్పడం కాదు అని కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు మాజీ మంత్రి కేటీఆర్. ఎస్‌ఆర్డీపీ పథకం కింద హైదరాబాద్‌లో చేపట్టిన పనులు 16 నెలల కాంగ్రెస్‌ పాలనలో నత్తనడకన సాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పూర్తయినవాటికి సున్నాలేసి రిబ్బన్‌ కటింగ్‌ చేశారు కానీ నిర్మాణంలో ఉన్నవాటి పురోగతిని సమీక్షించకుండా గాలికి వదిలేశాని మండిపడ్డారు. నాడు వాయువేగంతో ఎస్ఆర్డీపీ పథకం కింద ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ బ్రిడ్జీలు,16 నెలల కాంగ్రెస్ పాలనలో నత్తనడకన సాగుతున్న పనులు,ఫలక్ నుమా ఆర్వోబీని పట్టించుకునే పరిస్థితి లేదు అన్నారు.

ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టి చంచల్ గూడా జైలుకు పంపే శ్రద్ద దాని ముందున్న ఫ్లై ఓవర్ పూర్తి చేయడంపై లేదు, శిల్పా లేఅవుట్ వద్ద అంతర్జాతీయ విమానాశ్రయానికి కలిపే రెండో లెవెల్ వంతెనది అదే దుస్థితి, శాస్త్రిపురం ఆర్వోబీ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి, పూర్తయిన వాటికి సున్నాలేసి రిబ్బన్ కటింగులు చేశారు అని దుయ్యబట్టారు అని ఎక్స్ వేదికగా మండిపడ్డారు.

Also Read:బర్డ్ ఫ్లూ.. ఆ గ్రామంలో ఇంటింటి సర్వే!

- Advertisement -