KTR:పేప‌ర్ బ్యాలెట్ విధానంలోనే ఎన్నిక‌లు

7
- Advertisement -

దేశంలో ఈవీఎంలపై అనేక సందేహాలు ఉన్నాయి…అందుకే పేపర్ బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు జరపాలని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు.కేంద్ర ఎన్నిక‌ల సంఘంతో స‌మావేశం అనంత‌రం కేటీఆర్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.

ఎన్నిక‌ల స‌మ‌యంలో పార్టీలు ఇచ్చే అడ్డ‌గోలు హామీలు, తెలంగాణ‌లో చూస్తే కాంగ్రెస్ పార్టీ ఇష్ట‌మొచ్చిన‌ట్టు 420 హామీలు ఇచ్చి ప్ర‌జ‌ల‌ను మోసం చేసి మ‌భ్య‌పెట్టి గెలిచింది. ఈ విష‌యాల‌న్నీంటిని ఈసీకి వివ‌రంగా చెప్పాం. ఎన్నిక‌ల్లో ఇచ్చిన మేనిఫెస్టోకి రాజ‌కీయ పార్టీలు క‌ట్టుబ‌డి ఉండ‌క‌పోతే త‌ప్ప‌కుండా ఆ పార్టీని శిక్షించాల్సిన బాధ్య‌త కూడా ఈసీ మీద ఉంది అన్నారు.

కారు గుర్తును పోలిన సింబ‌ల్స్‌ను తొల‌గించాల‌ని కోరాం అన్నారు కేటీఆర్. 20 ఏండ్లుగా ఒక అంశంలో బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది…. కారు గుర్తును పోలిన సింబ‌ల్స్ దాదాపు 9 వ‌ర‌కు ఉన్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు 2019 ఎన్నిక‌ల్లో భువ‌న‌గిరిలో 5 వేల ఓట్ల‌తో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి గెలిచారు అన్నారు. ఎన్నిక‌ల క‌మిష‌న్ రాష్ట్రాల్లో ప‌ర్య‌టించాలి… ప్ర‌జ‌ల‌తో ఇంట‌రాక్ష‌న్ అవ్వాలి అని కోరాం అన్నారు.

Also Read:మహావతార్..హిందీలోనూ అదుర్స్!

- Advertisement -