మాకు జైళ్లు, పోరాటాలు కొత్త కాదు అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. చంచల్‌గూడ జైలులో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్…రేవంత్.. సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలపై మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అన్నారు. సింగరేణి కార్మికుల తరఫున నిలదీస్తూనే ఉంటాం..అక్రమాలను బయటపెడుతూనే ఉంటాం అన్నారు.
సింగరేణిలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును లేనిది ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ..ఇంత కుంభకోణం జరుగుతుంటే ముఖ్యమంత్రి గమ్మున ఎందుకు ఉన్నాడు ..దీనిపై నేను కిషన్ రెడ్డికి లేఖ రాస్తాను అన్నారు.
Also Read:FD డిటైల్స్ మర్చిపోయారా..అయితే మీకోసమే?
సింగరేణిలో రేవంత్ బావమరిది రూ. 15 వేల కోట్ల భారీ కుంభకోణం నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకే మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను అక్రమంగా అరెస్ట్ చేసింది కాంగ్రెస్ సర్కార్ అని ఆరోపించారు.

