బడంగ్‌పేట్ మున్సిపాలిటీలో కీసీఆర్ ప్రభుత్వ కాలంలో నిర్మించబడిన జిల్లా గ్రంథాలయానికి సంబంధించిన ఫోటోలను ఎక్స్ వేదికగా షేర్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్. మాజీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ గ్రంథాలయం అనేకమంది యువతకు పోటీ పరీక్షల కోసం సిద్ధమవ్వడంలో పెద్ద సహాయంగా నిలుస్తోంది అని కొనియాడారు కేటీఆర్.
ప్రతీ అంశంలోనూ కీసీఆర్ తనవంతు కృషి చేశారు. అయితే, ద్వితీయ శ్రేణి నాయకత్వం తగిన విధంగా ప్రచారం చేయలేకపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది అని నెటిజన్లు సైతం అభిప్రాయపడుతున్నారు..
ఇప్పుడు ఈ గ్రంథాలయం ఎంతోమంది విద్యార్థులకు చదువులో దోహదపడుతుండగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి మరిన్ని గ్రంథాలయాలు నిర్మించడంలో శ్రద్ధ చూపిస్తే బాగుంటుందని హితవు పలుకుతున్నారు.
A few more pictures of the same Badangpet Library built by KCR Govt
Well done @BrsSabithaIndra Garu 👍
KCR Garu did his best in every aspect of governance; unfortunately we, the secondary leadership didn’t publicise it effectively https://t.co/qEabcox6Q2 pic.twitter.com/rCTMyo3081
— KTR (@KTRBRS) August 25, 2025
Also Read:బాలయ్యకు పవన్ విషెస్

