ప్రొ.కోదండరాంను మళ్లీ ఎమ్మెల్సీకి నామినేట్ చేస్తాం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉస్మానియా యూనిరవ్సిటీలో పలు హాస్టల్ భవనాలను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజల సమస్యలను ప్రస్తావించేవాళ్లు చట్టసభల్లో ఉండాలనేది నా ఆలోచన అన్నారు.
మీ ఇంటిల్లిపాదీ మంత్రులుగా ఉంటే తప్పు లేదు కానీ.. కోదండరాం ఎమ్మెల్సీగా ఉంటే తప్పా? చెప్పాలన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ అనే పదానికి ప్రత్యామ్నాయం… ఈ రెండూ అవిభక్త కవలల్లాంటివి అన్నారు. ఉస్మానియా గడ్డ మీది నుంచే పీవీ నరసింహారావు దేశ స్వాతంత్య్రం కోసం ధిక్కార స్వరాన్ని వినిపించారు అన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్ భవనాలను ప్రారంభించారు సీఎం రేవంత్. రూ.10 కోట్లతో డిజిటల్ లైబ్రరీ రీడింగ్ పనులకు శ్రీకారం చుట్టారు. అలాగే వర్సిటీలో పెద్దఎత్తున పెండింగ్ పోస్టుల భర్తీ చేయనున్నట్లు తెలిపారు సీఎం.
Also Read:బాలయ్యకు పవన్ విషెస్

