- Advertisement -
చేనేత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని…వారిని ఆదుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి స్మృతి ఇరానీని కోరారు మంత్రి కేటీఆర్. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రిని కలిసిన కేటీఆర్ …నేతన్నల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను వివరించారు.
ఖమ్మం,మహబూబ్ నగర్ జిల్లాల్లో కొత్త హ్యాండ్లూమ్ క్లస్టర్‌లను ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రానికి కొత్తగా మరో 10 క్లస్లర్లు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. 8 వేల మరమగ్గాల ఆధునీకరణకు కేంద్రం నిధులు కేటాయించాలని కోరామని…ఇందుకు ఆమె సానుకూలంగా స్పందించిందన్నారు.
పవర్ లూమ్,హ్యాండ్ లూమ్ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించానని చెప్పారు. మరమగ్గాల ఆధునీకరణకు 50 శాతం సబ్సిడీ ఇస్తున్నామని చెప్పారు.
- Advertisement -