క్రిస్ గేల్…స్టన్నింగ్ క్యాచ్

153
gayle

క్రిస్ గేల్…క్రికెట్ లవర్స్‌కు పరిచయం అక్కర్లేని పేరు. ఫార్మాట్ ఏదైనా బ్యాట్‌తో విధ్వంసం సృష్టిస్తాడు. గేల్ క్రీజ్‌లో ఉన్నంత సేపు ప్రత్యర్ధి బౌలర్లకు వణుకు పుట్టాల్సిందే. అయితే కొంతకాలంగా ఫామ్‌ కొల్పోయి ఇబ్బందులు పడుతున్న గేల్…చాలాకాలం తర్వాత మళ్లీ వార్తల్లో నిలిచాడు.

అయితే,ఈ సారి వార్తల్లో నిలిచింది తనదైన బ్యాటింగ్‌ శైలీతో కాదు ఫీల్డర్‌గా. కెనడాలో జరుగుతున్న గ్లోబల్ టీ20 టోర్నీలో గేల్‌ అద్భుత క్యాచ్‌తో ఔరా అనిపించాడు. వాంకూవర్ నైట్స్‌ తరపున ఆడుతున్న గేల్….వెస్టిండీస్ బీ టీమ్‌ బ్యాట్స్‌మెన్ కావెమ్ హాడ్జ్ కొట్టిన షాట్‌ను స్లిప్‌లో అద్భుతంగా డైవ్ చేసి అందుకున్నాడు.

ముందు లెఫ్ట్‌హ్యాండ్‌తో ఆ క్యాచ్ పట్టుకోవడానికి ప్రయత్నించగా.. అది వేళ్లకు తగిలి పైకి ఎగిరింది. దానిని మరోసారి తన రైట్‌హ్యాండ్‌తో అందుకొని గేల్ ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.