తెలంగాణ భవన్ లో జరిగిన మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్నారు మాజీ మంత్రి కేటీఆర్. జూబ్లీహిల్స్ ఎలక్షన్ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే ఎలక్షన్ …కారుకు, బుల్డోజర్ కు మధ్య జరుగుతున్న ఎలక్షన్ ఇది అన్నారు. రెండేళ్ల నుంచి రాష్ట్రంలో అహనా పెళ్లంట సినిమా నడుస్తోంది… ఆ సినిమా తరహాలోనే కోడిని చూపించి.. అదే చికెన్ బిర్యాని .. ఆ కోడి పేరే ఆరు గ్యారెంటీలు.. నిన్న యూసఫ్‌గూడకు వెళ్లారు.. అదేదో పిలిచినట్లే రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లారు.. మన సన్మానం మనమే చేపించుకోవడం అంటే అదే..నేను చెప్పిన ప్రతిమాట నిలబెట్టుకుంటా అని నేనేమి చెప్పట్లేదు అని ఆ మీటింగ్ చివర్లో రేవంత్ రెడ్డే చెప్పేశారు అన్నారు.
కాంగ్రెస్‌కు ఓటేయాలనే ఉత్సాహం ఎవ్వరిలోనూ కనిపించడం లేదు..రాష్ట్రంలో ధాన్యం పత్తి కొనుగోలు చేసే పరిస్థితే లేదు…బోనస్ లేదు.. పెట్టుబడి సాయం లేదు.. విత్తనాలు లేవు.. ఎరువులు లేవు అన్నారు. ఎరువుల కోసం లైన్‌లో నిలబడి రైతు చనిపోయిన పరిస్థితి కూడా చూశాం… రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను కూడా మోసం చేశారు.. మంత్రులు అబద్ధాలు చెబితే కనీసం అతికేటట్లు కూడా లేవు అన్నారు.
మొత్తం మీద ఇప్పటి వరకు ఇచ్చినవి ఆరు, ఏడు వేలు కూడా లేవు.. యువతులకు స్కూటీ అన్నారు.. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని మాట తప్పారు… ఈ పైసలు ఎక్కడికి పోయాయని మహిళలు ఎదురు చూస్తున్నారు…ఫ్రీ బస్ అని చెప్పి మహిళలకు ఫ్రీ ఇచ్చి.. పురుషులకు రేట్లు పెంచారు..భార్యకు ఫ్రీ ఇచ్చి.. భర్త నుంచి ఆ డబ్బులు లాక్కుంటున్నారు… తులం బంగారం ఇచ్చే బాపతు కాదని మేం ముందే చెప్పాం.. అదే నిజమైంది, ఇందిరమ్మ రాజ్యం అని ఒక్క ఇల్లు కట్టలేదు కానీ.. వేలాది ఇళ్లు మాత్రం కూల్చేశారు అన్నారు.
పెద్దల ఇల్లు కనిపించవు.. రేవంత్ రెడ్డి అన్న ఇల్లు కనిపించదు.. పేదల ఇల్లు కూలగొట్టేశారు,,ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌ను గెలిపించాలి..ఇది కారుకు, బుల్డోజర్‌కు మధ్య జరుగుతున్న ఎన్నికలు..రెండేళ్ల కిందట ఇలానే ప్రజలు మోసపోయారు..ఒక్క హైదరాబాద్ ప్రజలే కాంగ్రెస్ మాటలు విని మోసపోలేదు..కాంగ్రెస్‌ను నమ్మొద్దని హైదరాబాద్ వాసులు అన్ని సీట్లలో ఆ పార్టీని ఓడించారు…ఇప్పుడు కూడా కాంగ్రెస్ కొత్త కొత్త వేశాలు వేసుకుంటోంది..మంత్రులు గల్లీ లీడర్ల లాగా తిరుగుతున్నారు అన్నారు.
కంటోన్మెంట్‌లో కాంగ్రెస్ గెలిచి ఏడాదిన్నర అయ్యింది.. ఒక్క పనీ చేయలేదు…వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పి వాళ్లను మోసం చేశారు..అమ్మకు అన్నం పెట్టనోడు.. చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తడా..?…మా దగ్గర పైసలు లేవు.. మాకు పైసలు ఇవ్వండని వరల్డ్ బ్యాంక్‌కు ఆ పార్టీ ఎమ్మెల్యేలు లేఖలు రాస్తున్నారు..ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి పైసలు తెస్తా అని చెబుతున్నడు…అసలు రేవంత్ రెడ్డి దగ్గరనే డబ్బులు లేకపోతే.. ఇక ఈయన ఎక్కడి నుంచి డబ్బులు తీసుకువస్తాడు..మేం ఎంత అభివృద్ధి చేశామో చెప్తాం.. మీరేం చేశారో చెప్పే దమ్ముందా..?…ప్రజలను అంగడి సరుకులా కొని.. ఎన్నికలో గెలిచేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది అన్నారు.

