ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు

222
3 MLCs disqualified in Telangana
- Advertisement -

పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేశారు శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌లో పొందుపరిచిన పార్టీ పిరాయింపుల చట్టం ప్రకారం వారిపై వేటు వేసినట్లు స్వామి గౌడ్ చెప్పారు. వేటు పడిన వారిలో రాములు నాయక్‌,భూపతి రెడ్డి,యాదవ రెడ్డి ఉన్నారు.

టీఆర్ఎస్‌ నుంచి శాసనమండలికి ఎన్నికైన భూపతిరెడ్డి, రాములు నాయక్‌, యాదవరెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరారని ఆ పార్టీ నేతలు మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో పాటు కొన్ని ఆధారాలను కూడా సమర్పించడంతో వాటిని పరిశీలించిన మండలి ఛైర్మన్‌ నోటీసులు జారీ చేసి ..ముగ్గురు ఎమ్మెల్సీల వాదన విన్నారు. చివరకు వారిపై వేటు వేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.

వేటు పడిన వారిలో రాములు నాయక్ గవర్నర్ కోటాలో మండలికి ఎన్నికవగా యాదవరెడ్డి ఎమ్మెల్యే కోటాలో మరోసభ్యుడు భూపతిరెడ్డి నిజామాబాద్‌ నుంచి స్థానిక సంస్థల కోటాలో మండలి సభ్యుడిగా ఎన్నికైయ్యారు.

- Advertisement -