ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వే మాలక్ష్యం:కేటీఆర్‌

358
- Advertisement -

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు సీఎం కేసీఆర్‌..ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూస్తేనే మన జన్మ ధన్యమైతదని కేటీఆర్‌ అన్నారు. ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అభివృద్ధే కులం సంక్షేమమే మతం జనహితమే మన అభిమతం అని చెప్పి ముందుకు సాగిపోతున్న తెలంగాణ ప్రభుత్వంకు కొన్ని దుష్టశక్తులు అడ్డుపడుతున్నాయన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని మన్నెగూడలో నిర్వహించిన లారీ యజమానుల డ్రైవర్ల ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్‌ పాల్గొన్నారు.

తెలంగాణ దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. పేదరికమే నిర్మూలన లక్ష్యంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. పారిశ్రామికవేత్తల నుంచి మొదలుకొంటే కార్మికులు, శ్రామికుల బాగోగులు చూస్తున్నాం. నాడు ఉద్యమంలో ఉన్న సమయంలో.. మా దోస్తులు అనేవారు. మీకు తెలంగాణ వస్తే రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే దమ్మున్న నాయకత్వం మీకు ఉందా? అని అడిగేవారు. కానీ ఇవాళ చూస్తుంటే ప్రపంచంలో ఉన్న నగరాలను దాటుకొని, మన హైదరాబాద్‌కు వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు వచ్చింది. అది మన దమ్ము. మన కేసీఆర్ నాయకత్వ పటిమకు ఈ అవార్డు నిదర్శనమని కేటీఆర్ చెప్పారు.

తెలంగాణ వచ్చిన తర్వాత కరెంట్‌ కోతల తిప్పలు లేవన్నారు. తద్వారా తెలంగాణ చిన్న పెద్ద పరిశ్రమలు గృహావసరాలకు కరెంటు నాణ్యమైన24గంటల కరెంట్‌ ఇస్తున్నామన్నారు. కరెంట్, తాగునీటి సమస్య పరిష్కరించాం. దశాబ్దాల నుంచి ఉన్న ఫ్లోరోసిస్ వ్యాధిని రూపుమాపాం. వ్యవసాయం పండుగలా మారిందన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను బాగు చేసుకున్నాం. కాళేశ్వరం కట్టాం. పాలమూరు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇవాళ మూడున్నర కోట్ల ధాన్యం ఉత్పత్తి చేస్తున్నాం. ఇది కదా తెలంగాణ దమ్ము అని కేటీఆర్ స్పష్టం చేశారు.

- Advertisement -