ఇది గొప్ప అవకాశం..పీయూష్‌కు కేటీఆర్ లేఖ

252
ktr
- Advertisement -

కరోనాపై పోరాటంలో భాగంగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాశారు మంత్రి కేటీఆర్. ఈ మేరకు పలు సూచనలు చేసిన కేటీఆర్ భారత్‌ ముందు గొప్ప అవకాశం ఉందని దానిని ఒడిసి పట్టుకోవాలన్నారు.

దేశంలోకి పెట్టుబడులను మరింతగా ఆకర్షించేలా, ఆర్థిక రంగాన్ని బలోపేతం చేసేలా కేంద్రం చర్యలు తీసుకుంటే బాగుంటుందని తెలిపారు. పెట్టుబుడుల అవకాశాలను గుర్తించి, ఫాలోఅప్ చేయాలన్నారు.

నాణ్యమైన మెషినరీ సేకరణ కోసం త్వరితగతిన రుణాలు మంజరు చేయాలని, సిబ్బందికి అంతర్జాతీయ శిక్షణ అందించాలని, ఎగుమతులపై ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు అందించాలని సూచించారు.

- Advertisement -