మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ మంచినీరు అందిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కొంపల్లిలో మిషన్ భగీరథ పనులకు శంకుస్ధాపన చేసిన అనంతరం మాట్లాడిన కేటీఆర్ ప్రజలపై ఎలాంటి భారం పడకుండానే ప్రతి ఇంటికీ మంచినీటి పనులు అందించే కార్యక్రమం చేపడుతున్నామని చెప్పారు. కొంపల్లిలో మిషన్ భగీరథ ప్రాజెక్టుద్వారా అవుటర్ రింగ్ రోడ్ గ్రామాలకు తాగునీరు అందనుందని.. లక్షా 50వేల కుటుంబాలు లబ్ది పొందనున్నారని తెలిపారు.. 628 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టామని….. ఏడాదిలో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
ప్రజా సమస్యలన్నీ తీర్చేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు పోతున్నారన్నారు. రాష్ట్రంలోని ప్రతి గడపకు మంచి నీరు అందిస్తమన్నారు. దీని ద్వారా 183 గ్రామాల్లోని 10 లక్షల మందికి మేలు కలుగుతుందన్నారు. ఏడాదిలోగా ఈ పనులన్నీ పూర్తి చేస్తామన్నారు. ఇండ్లు, వ్యవసాయం, పరిశ్రమలకు 24 గంటల కరెంట్ ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దని ఆయన వివరించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంక ప్రతిపక్షాలకు పనిలేకుండా పోయిందని ఎద్దేవా చేశారు.
హైదరాబాద్ లో 30 లక్షల విలువ చేసే ఇంటిని ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇస్తున్నదన్నారు. సంవత్సరంలోగా హైదరాబాద్ లో లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టి చూపిస్తమని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఒక ఇంటికి అవుతున్న ఖర్చు రూ. 8 లక్షల 65 వేలని తెలియజేశారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం కోసం రూ. 18 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు. నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణి కావాలన్నదే సీఎం కేసీఆర్ కల అని మంత్రి చెప్పారు. అనంతరం గండిమైసమ్మలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి,,షాపూర్ నగర్‌లో రిజర్వాయర్‌కు శంకుస్ధాపన చేశారు కేటీఆర్.