వరంగల్‌లో పలు అభివృద్ది పనులను ప్రారంభించిన కేటీఆర్‌..

48
ktr
- Advertisement -

పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈరోజు వరంగల్ నగరంలో పర్యటిస్తున్నారు. ముందుగా నగరంలోని భద్రకాళి బ్రిడ్జి నుండి జీడబ్ల్యూఎంసీ కార్యాలయం మరియు అలంకార్ బ్రిడ్జి నుండి నిర్మించిన స్మార్ట్ రోడ్లను మంత్రి దయాకర్ రావుతో కలిసి ప్రారంభించారు.

అనంతరం వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలో 150 KLD సామర్థ్యంతో నిర్మించే మానవ వ్యర్ధాల నిర్వహణ ప్లాంట్, జీడబ్ల్యూఎంసీ పరిపాలన భవనం, దివ్యాంగుల శిక్షణ కేంద్రం, స్పోర్ట్స్ కాంప్లెక్స్, కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇతర అభివృద్ధి పనులకు మంత్రులు కేటీఆర్, సత్యవతి రాథోడ్, దయాకర్ రావు శంకుస్థాపన చేశారు. అలాగే వరంగల్ నగరంలో ₹ 1.5 కోట్లతో ఆధునీకరించిన ప్రాంతీయ గ్రంథాలయాన్ని మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు.

నర్సంపేట్ పట్టణ ప్రజలకు ఇంటింటికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేసేందుకు సర్వాపురంలో శివారులో పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) లైన్లు వేయగా పంపిణీ, నిల్వ కేంద్రాలను మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీ దయాకర్ రావు , శ్రీ సత్యవతి రాథోడ్ నేడు ప్రారంభించారు. రాష్ట్రంలోనే తొలిసారి ప్రయోగాత్మకంగా నర్సంపేటలో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎంపీ శ్రీమతి మాలోత్ కవిత తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యవతి రాథోడ్, దయాకర్ రావు,ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -