గాంధీ భవన్‌లో రసాభాస.. NSUI నేతలు మధ్య కొట్లాట‌..

46
nsui
- Advertisement -

బుధవారం కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్‌యూఐ కు సంబంధించిన తెలంగాణ విభాగం ఎగ్జిక్యూటివ్ స‌మావేశం ర‌సాభాస‌గా ముగిసింది. ఎస్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా కొన‌సాగుతున్న బ‌ల్మూరి వెంక‌ట్‌, ఉపాధ్య‌క్షురాలిగా ఉన్న చంద‌నారెడ్డిల మ‌ధ్య చోటుచేసుకున్న వాగ్వాదం కాస్తా ఇరువ‌ర్గాల మ‌ధ్య కొట్లాట‌కు దారి తీసింది. ఇరు వ‌ర్గాలు కుర్చీలు, బ‌ల్ల‌లు ఎత్తుకుని మ‌రీ ప‌ర‌స్ప‌రం దాడులు చేసుకున్నారు. రెండేళ్లుగా ఎన్ఎస్‌యూఐ ఎగ్జిక్యూటివ్ స‌మావేశం జ‌ర‌గ‌లేదు. ఈ క్ర‌మంలో బుధ‌వారం గాంధీ భవన్ ఆవరణలోని ఇందిరా భవన్ లో మొద‌లైన సంఘం ఎగ్జిక్యూటివ్ స‌మావేశంలో ఇదే విష‌యాన్ని చంద‌నారెడ్డి ప్రస్తావించారు. చంద‌నారెడ్డి ప్ర‌శ్న‌తోనే స‌మావేశంలో ఇరు వ‌ర్గాల మ‌ధ్య వాగ్వాదం మొద‌లైంది. ఆపై మ‌రింత రెచ్చిపోయిన ఇరు వ‌ర్గాలు కుర్చీలు, బ‌ల్ల‌లు విసురుకుంటూ ఒక‌రిపై మ‌రొక‌రు దాడి చేసుకున్నారు. దీంతో ప్ర‌శాంతంగా సాగాల్సిన స‌మావేశం ర‌సాభాస‌గా ముగిసింది.

చందనా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తన అభిప్రాయాలూ చెబితే బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రెసిడెంట్ వెంకట్ మీసాలు తిప్పుతూ.. వేలు చూపించాడని ఆమె తెలిపింది. మీడియా ముందు మాట్లాడుతుంటే వెంకట్ అనుచరులు అడ్డుకున్నారు. ఎన్‌ఎస్‌యూఐ ని వెంకట్ వన్ మ్యాన్ షో గా నడిపిస్తున్నాడని చందన ఫైర్ అయ్యారు. వెంకట్ ప్రమోషన్ లో భాగంగా హుజురాబాద్ ఎమ్మెల్యే గా పోటీ చేశాడు. అలాగే మిగతా వారికీ కూడా అవకాశాలు రావాలి. ఇప్పటి వరకు కాలేజి, యూనివర్సిటీ కమిటీలు ఎందుకు వేయలేదన్నారు చందన. ఎన్ఎస్‌యూఐ కమిటీలో వున్న చాలా మందికి వెంకట్ తప్పా మరొకరు తెలియకపోవడం బాధాకరం అన్నారు. ఇవ్వాలా మీటింగ్ లో నిలదీసే ప్రయత్నం చేస్తే బల్లాలు ఎత్తేసి వెళ్లిపోతున్నారు. అమ్మాయిని అని చూడకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఈ విషయాలు పీసీసీ దృష్టికి తీసుకెళ్తా అని చందన రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -