- Advertisement -
శనివారం రంగారెడ్డి జిల్లా, మీర్ పేట్ మున్సిపాలిటీలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. పట్టణంలో నిర్మించే సమీకృత శాఖాహార, మాంసాహార మార్కెట్, మంచినీటి సరఫరా కోసం చేపట్టే పనులు, బాక్స్ డ్రైన్స్ నిర్మాణం మరియు రోడ్డు విస్తరణ పనులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, ఎగ్గే మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -