పేద బ్రాహ్మణులకు ఉపయోగ పడేవిధంగా పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ దేశంలోనే ఆదర్శంగా నిలవాలని ముఖ్యమంత్రి అభిలషిస్తున్నారని రాష్ట్ర ఐ.టి. శాఖ మంత్రి శ్రీ కె.టి.రామారావు అన్నారు. సోమవారం గోపన్నపల్లి లో బ్రాహ్మణ సదన్ కు భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడిన మంత్రి కేటీఆర్ ఒక సంవత్సర కాలంలో భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని అన్నారు.
బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కు మెదటి సంవత్సరం రూ.100 కోట్లు , రెండవ సంవత్సరం మరో రూ.100 కోట్లు కేటాయించామని తెలిపారు. ముఖ్యమంత్రి ఆలోచనల కు ఆనుగుణంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని పరిషత్ ను కోరారు. హిందు థర్మాన్ని పాటిస్తు అన్ని మాతాలను సమానంగా చూస్తున్న ఘనత దేశంలో ఒక్క కేసీఆర్‌కే చెందుతుందని అన్నారు. కేసీఆర్ సిద్ది పేటలో ఎం.ఎల్.ఎ గా ఉన్నప్పుడే బ్రాహ్మణ భవనాన్ని ఏర్పాటు చేశారని, అదేస్పూర్తితో బ్రాహ్మణుల సంక్షేమం కోసం విప్రహిత బ్రాహ్మణ సదన్ ను రాష్ట్ర స్థాయిలో నేడు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
బ్రాహ్మణుల సమస్యల పట్ల సమగ్ర అవగాహన ఉన్న వ్యక్తి మన ముఖ్యమంత్రి అని తెలిపారు. బ్రాహ్మణులలో అనేకమంది పేదలుగా ఉన్నట్లు తమ ప్రభుత్వం గుర్తించిందని అన్నారు. పేద బ్రాహ్మణ పిల్లల భవిష్యత్తు కోసం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కృషి చెయ్యాలని అన్నారు. తెలంగాణలో ప్రధాన దేవాలయాలైన యాదాద్రి, వేములవాడ, అభివృద్ధికి నిధులను కేటాయించామని అన్నారు. దేశంలో రాజ్యాంగ పదవిలో ఉన్నవారు, ఎవరు చేయని అయుత మహా చండీయాగం చేశారని తెలిపారు. తెలంగాణ లో అన్ని మతాలు, అన్ని కూలాలను సమానంగా ఆదరిస్తున్న ప్రభుత్వం తమ ప్రభుత్వమని అన్నారు.
రాష్ట్రంలో పేద బ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ను ఏర్పాటు చేసిందని రవాణ శాఖ మంత్రి శ్రీ మహేందర్ రెడ్డి అన్నారు. అన్ని కులాలను, అన్ని మతాలను సమానంగా ఆదరిస్తున్నామని అన్నారు. ప్రభుత్వ సలహాదారు మరియు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షులు డా.కె.వి.రమణాచారి మాట్లాడుతూ, బ్రాహ్మణ సంక్షేమ భవన నిర్మాణానికి 6 ఎకరాల స్దలాన్ని, రూ.10 కోట్లు కేటాయించినందుకు ముఖ్యమంత్రికి చేతులెత్తి నమస్కరించి బ్రాహ్మణ సమాజం యావత్తూ కృతజ్ఞతలను తెలుపుతుందని అన్నారు.
ఫిబ్రవరి లో ఏర్పడిన బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ వెంటనే కార్యకలాపాలను ప్రారంభించిందని అన్నారు. రూ. 10 కోట్ల తో ఏర్పాటు చేస్తున్న విప్రహిత బ్రాహ్మణ సదన భవనంలో , విద్యార్థుల కు వసతి, పీఠాధిపతులకు వసతిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బ్రాహ్మణ యువతీ, యువకుల నైపుణ్య అభివృద్ధికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కళ్యాణాలకు కళ్యాణ మండపం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అశుభకార్యక్రమాలు నిర్వహించేందుకు ఒక హాలును కూడా నిర్మించనున్నట్లు తెలిపారు. దీని స్పూర్తితో జిల్లాలో బ్రాహ్మణ భవనాల నిర్మాణాలకు పలువురు ముందుకు వచ్చారని తెలిపారు. నైతికవిలువలు పెంపొందించే కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని, ఈ విప్రహిత భవనం వల్ల బ్రాహ్మణ సమాజానికి సంఘటిత శక్తి ఏర్పడుతుందని అన్నారు.
బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు జ్వాలా నర్సింహారావు. ముఖ్యమంత్రి ఆలోచల విధానం అనుగుణంగా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతేక ప్రతినిధి వేణగోపాల చారి, ఎంపీలు కె.విశ్వేశ్వర్ రెడ్డి, కెప్టెన్ లక్ష్మి కాంతరావు, ఎం.ఎల్.సి లు పురాణం సతీశ్, రామచంద్ర రావు, ఎమ్మెల్యే సతీష్ కుమార్, తెలుగు భాష సంఘం అధ్యక్షులు దేవులపల్లి ప్రభాకర్ రావు , గ్రంధాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్, ఆర్ అండ్ బి ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఐ.వై.ఆర్. కృష్ణా రావు , బ్రాహ్మణ పరిషత్ సభ్యులు పాల్గొన్నారు.