KTR:ప్రపంచంతో పోటీ పడదాం

53
- Advertisement -

ప్రపంచంతో పోటీ పడే సత్తా మనకుందన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్‌ నానక్‌రాంగూడలో సెల్లాంటిస్‌ డిజిటల్‌ హబ్‌ను , రైట్‌ సాఫ్ట్‌వేర్‌ ఆఫీస్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్..ప్రభుత్వం మొబిలిటి వ్యాలి ప్రారంభించిందన్నారు. కంపెనీకి ప్రభుత్వం నుంచి అన్ని సహాయ సహకారాలు అందుతాయని చెప్పారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఉండగా హైదరాబాద్‌ ఐటీలో 3 లక్షల మంది పనిచేసే వాళ్లు, ప్రస్తుతం ఆ సంఖ్య 9 లక్షలకుపైగా పెరిగిందన్నారు. ఇక్కడ ఉన్న గ్రోత్‌ దేశంలోని ఏ నగరంలో లేదని వెల్లడించారు. రిసోర్స్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియాగా హైదరాబాద్‌ ఎదిగిందని మంత్రి కేటీఆర్‌ …ట్యాలెంట్‌ ఉన్న పిల్లలకు మనదేశంలో కొరతలేదని తెలిపారు.

Also Read;తెలంగాణకు చేయూతనివ్వండి:నిరంజన్ రెడ్డి

వరంగల్‌లో ఐటీ కంపెనీ ఏర్పాటు చేసిందందుకు రైట్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీకి ధన్యవాదాలు తెలిపారు. మూడేండ్లలో వెయ్యి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినందుకు అభినందించారు.

Also Read:Niharika:నన్ను ఎవరూ ఇబ్బంది పెట్టొద్దు

- Advertisement -