Leadermate వెబ్ పోర్టల్ ఆవిష్కరణ..

368
ktr
- Advertisement -

రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరియు నియోజకవర్గ అభివృద్ధి పనులను ప్రజలకు చేరువయ్యే విధంగా రూపొందించిన “Leadermate” వెబ్ పోర్టల్ ను నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ శానంపూడి సైదిరెడ్డి గారి జన్మదినం సందర్భంగా TRS పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు మరియు IT శాఖ మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారకరామారావు గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగినది.

ఈ సందర్భంగా సైదిరెడ్డి గారు ఈ వెబ్ పోర్టల్ గురించి వివరిస్తూ… నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వ పథకాల వివరాలు, పట్టణ మరియు గ్రామ స్థాయిలో అభివృద్ధి పనుల వివరాలు , CMRF , Party ఇన్సూరెన్స్ లబ్ధిదారుల వివరాలు, రక్తదాతల వివరాలు, నియోజవర్గ శాసనసభ్యుల రోజువారీ కార్యక్రమాల వివరాలు మరియు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించే విధంగా రూపొందించామని వివరించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ “సాంకేతికతను అభివృద్ధి చేయడం వలన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నేరుగా ప్రజలలోకి తీసుకుపోయే అవకాశం ఉంటుందని, ఈ “Leadermate” వెబ్ పోర్టల్ అన్ని రకాల ఉపయోగపడుతున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో వెబ్ పోర్టల్ డెవలపర్ విశాల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -