బయోఏషియా సదస్సు ప్రారంభం..

11
- Advertisement -

హైదరాబాద్ వేదికగా బయో ఏషియా సదస్సు ప్రారంభమైంది. మూడు రోజుల పాటు ఈ సదస్సు జరుగనుండగా సదస్సును ప్రారంభించారు మంత్రి కేటీఆర్.ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌, నేషనల్‌ హెల్త్‌ అథారిటీ అదనపు సీఈవో బసంత్‌ గార్గ్‌, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల నుంచి 2 వేలకు మందికిపైగా ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా లైఫ్‌ సైన్సెస్‌, ఫార్మా, మెడ్‌టెక్‌, ఆరోగ్య సంరక్షణ రంగాలపై నిపుణుల ప్రసంగాలు, బృంద చర్చలు జరుగనున్నాయి.

తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే లైఫ్‌సైన్సెస్‌, ఫార్మా రంగ పర్యావరణ వ్యవస్థకు నిలయంగా ఉన్నది. ఇక్కడ 800కుపైగా ఫార్మా, బయోటెక్‌ కంపెనీలు ఉన్నాయి. వీటి విలువ 50 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఈ నేపథ్యంలో కొత్త పెట్టుబడులను ఆకర్షించేందుకు బయో ఏషియా సదస్సు ఎంతగానో దోహదపడుతుందని చెప్పవచ్చు. 50కిపైగా దేశాలనుంచి ప్రతినిధులు వస్తున్నందున హైదరాబాద్‌లో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -