పీవీకి భారతరత్న.. ఫలించిన బి‌ఆర్‌ఎస్ కృషి !

15
- Advertisement -

తెలంగాణ బిడ్డ మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతదేశ అత్యున్నత  పురస్కారమైన ” భారతరత్న” ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. మోడీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల తెలుగు రాష్ట్రల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తొలి తెలుగు ప్రధానిగా చరిత్రపుటల్లో నిలిచిన పీవీ నరసింహారావు తన పాలన దృక్పథంతో దేశానికి ఆయన చేసిన సేవ అనితరసాధ్యం. దేశాన్ని ఐదేళ్లు పాలించిన తొలి గాంధీయేతర వ్యక్తిగా కాంగ్రెస్ లో ఆయన స్థానం ఎప్పటికీ నిలిచిపోతుంది. పదవిలో ఉన్నంతకాలం అధికారాన్ని వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించని నిరాడంబరుడిగా పేరు గాంచారు. ఆ టైమ్ లో పంజాబ్ కేంద్రంగా పేట్రేగిపోతున్న ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా తన పాలనలో అణిచి వేశారు పీవీ నరసింహారావు. దేశాన్ని అటు ఆర్థికంగాను, ఇటు అభివృద్ది పరంగాను సమర్థవంతంగా ముందుగు నడిపించిన పీవీ నరసింహారావు కు భారతరత్న లభించడం ప్రతి తెలుగువారికి గర్వకారణం.

కాగా పీవీకి భారతరత్న ఇవ్వాలని బి‌ఆర్‌ఎస్ ఆగ్రనేతలైన కే‌సి‌ఆర్, కే‌టి‌ఆర్ గత కొన్నాళ్లుగా కేంద్రప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నారు. బి‌ఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఉన్న సమయంలో పీవీకి భారతరత్న ఇవ్వాలని గట్టిగానే గళం వినిపించారు. దీంతో ఎట్టకేలకు పీవీ నరసింహారావుకు భారత రత్న ఇవ్వడంపై బి‌ఆర్‌ఎస్ అధినేత కే‌సి‌ఆర్, వర్కింగ్ ప్రసిడెంట్ కే‌టి‌ఆర్ సోషల్ మీడియా వేధికగా ఆనందాన్ని పంచుకున్నారు. తమ డిమాండ్ ను గౌరవించినందుకు మాజీ సి‌ఎం కే‌సి‌ఆర్ కేంద్ర ప్రభుత్వ్గాన్నికి ధన్యవాదలు తెలిపారు.  తాము అధికారంలో ఉన్నప్పుడు పీవీఆర్ శతదినోత్సవ వేడుకలు నిర్వహించామని, అప్పటి నుంచి పీవీఆర్ కు భారత రత్న డిమాండ్ చేస్తున్నామని, తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం హర్షించాల్సిన విషయం అంటూ కే‌టి‌ఆర్ ట్వీట్ చేశారు. ఇటు సామాన్య ప్రజల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై సానుకూల స్పందన వస్తోంది.

https://x.com/KTRBRS/status/1755857211182793099?s=20

- Advertisement -