జనహితమై సాగుతున్న గౌతముడు..కేసీఆర్

286
kavitha
- Advertisement -

సీఎం కేసీఆర్‌కు మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ట్వీట్ చేసిన కేటీఆర్..ఫోటోను షేర్ చేశారు. వీరాధి వీరుడు అతడు ..విజయానికి బావుట అతడు.. ఆవేశపు విల్లంబతడు.. ఆలోచన శిఖరంబతడు.. తలవంచని యోధుడు అతడు.. అభయానికి బాసట అతడు ..జనహితమే అభిమతమై సాగుతున్న గౌతముడని కొనియాడారు. మిమ్మల్ని ఫాలో అవుతున్నందుకు గర్వంగా ఉందని..మీకూతురిని ఆశీర్వదించండి అంటూ ట్వీట్ చేసింది కవిత.

కేసీఆర్ బర్త్ డే సందర్భంగా టీఆర్ ఎస్ యూత్ వింగ్ రూపొందించిన వీడియో సాంగ్ ను ఎంపీ కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో కవిత మాట్లాడుతూ, టీఆర్ఎస్ యూత్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే వివేక్, కుత్బుల్లాపూర్ యువ నాయకులందరూ కలిసి మంచి పాటను రూపొందించారని అభినందించారు.

రాష్ట్రంలోని ప్రతి సంక్షేమం పథకం కేసీఆర్ ఆలోచనలో నుంచి పుట్టినదేనని, వాటన్నింటినీ వివరించే విధంగా ఈ పాటను రూపకల్పన చేశారని, సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఈ పాట కూడా ఓ కానుక అని, ఈ కానుక ప్రత్యేకంగా నిలవాలని, తమ యువ మిత్రులందరూ పడ్డ కష్టాన్ని కేసీఆర్ గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని కవిత అన్నారు. సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో మంత్రి తలసానితో కలిసి ప్రత్యేక పూజలు చేసింది ఎంపీ కవిత.

 

 

 

- Advertisement -