ఆధ్యాత్మిక బాటలో కేటీఆర్..!

306
ktr temples

ఏదైనా పని చేపట్టినప్పుడు ముహూర్తం,వాస్తు, లక్కీ నంబర్, చూసుకోవడంచాలా మందికి సెంటిమెంట్. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఈ సెంటిమెంట్ కాస్త ఎక్కువే. ఏ కార్యక్రమం ప్రారంభించాలన్న వాస్తు, జాతకం, పంచాంగం అన్నీ చూసుకునే చేస్తారు. అంతేగాదు ఏ కార్యక్రమం తలపెట్టినా కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీ. భారతదేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ చేసినన్ని యాగాలే ఏ రాజకీయ నాయకుడు చేసిన దాఖలాలు లేవు. ప్రజల సంక్షేమం కోసం గంగా జమునా తెహజీబ్‌గా తెలంగాణ విరసిల్లాలని ఆకాంక్షించే కేసీఆర్ అన్నిమతాల పండుగలను అధికారికంగా జరిపి ప్రజలను మన్ననలు పొందారు.

ఇక కేసీఆర్ వారసుడు కేటీఆర్‌ శైలీ మాత్రం కాస్త డిఫరెంట్. దేవుడిని పెద్దగా నమ్మని కేటీఆర్‌కు స్వతంత్ర భావాలు ఎక్కువ. అన్నా అంటే వెంటనే స్పందించే కేటీఆర్‌ ఏ అంశాన్నైనా హేతుబద్దంగా ఆలోచించే సమర్ధత ఎక్కువే. అందుకే ప్రతిదానికి దేవుడా అనే వ్యక్తిత్వం కేటీఆర్‌ది కాదు. కేసీఆర్ ఎప్పుడు యాగం నిర్వహించినా కేటీఆర్ హడావిడి ఎక్కువగా ఉండదు. శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు కూడా దైవ సాక్షిగా కాకుండా మనసాక్షిగా ప్రమాణం చేశారు. మంత్రి హోదాలోనూ ఆలయాలను సందర్శించిన సందర్భాలు తక్కువే.

కానీ ప్రస్తుతం కేటీఆర్‌ మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. కేరళ,తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్‌ కుటుంబసమేతంగా ప్రముఖ గుళ్లను, గోపురాలను సందర్శించారు. ఆలస్యంగా కుటుంబసభ్యులతో కలిసిన కేటీఆర్‌..తండ్రి బాటలో నడుస్తున్నారు. ఎప్పుడులేని విధంగా తండ్రితో పాటు ఆలయాలను సందర్శించారు. భక్తితో మొక్కులు చెల్లించడం, ప్రత్యేక పూజలు చేశారు. కేటీఆర్‌లో వచ్చిన ఈ మార్పు చూసి కుటుంబసభ్యులు ఆశ్చర్యపోయారట. కేటీఆర్ గుడుల చుట్టూ తిరిగే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కేటీఆర్‌ని దగ్గరి నుండి చూసిన వ్యక్తులు,ఆయన సన్నిహితులు ఆశ్చర్యం వ్యక్తం చేసినా తండ్రి బాటలో నడుస్తున్నారని చెబుతున్నారు.

ktr temple ktr temple ktr temple ktr