- Advertisement -
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక యూనివర్సిటీ నుండి ఆహ్వానం అందించింది. అమెరికాలో ఫిబ్రవరి 16,17న హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే హార్వర్డ్ ఇండియా వార్షిక సదస్సుకు హాజరుకావాలని కేటీఆర్‌కు ఆహ్వానం అందింది.
ఈ సదస్సుకు వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు హాజరవనున్నారు. సమకాలిన భారతదేశం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లు, వివిధ అభివృద్ధి అంశాలపై రెండు రోజుల పాటు సమావేశంలో చర్చ జరగనుంది. ప్రత్యేక వ్యక్తిగా హాజరై ప్రసంగించాలని కేటీఆర్‌ను సదస్సు నిర్వాహకులు కోరారు.
ఇక తన పేరు మీద కొంతమంది ఏర్పాటుచేస్తున్న సంఘాలు,యువసేనలు,అభిమాన సంఘాలకు తన నుండి ఎలాంటి మద్దతు లేదని తెలిపారు కేటీఆర్. పార్టీ, తనపై అభిమానం ఉంటే టీఆర్‌ఎస్, దాని అనుబంధ సంఘాలతో కలసి పనిచేయాలని సూచించారు.
- Advertisement -