బీఆర్ఎస్ రజతోత్సవ సభ పార్టీ చరిత్రలో ఒక అతిపెద్ద బహిరంగ సభ కాబోతుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వరంగల్, ఎల్కతుర్తిలో సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, మౌనం పాటించి నివాళర్పించారు కేటీఆర్.
ఉద్యమం నాటి రోజులు గుర్తొచ్చేలా ఉద్యమ స్ఫూర్తిని, కేసీఆర్ కి రైతాంగం మీద ఉన్న ప్రేమను చాటుతూ ఈ సభను నిర్వహిస్తామన్నారు. బండెనుక బండి కట్టి.. ఎడ్లబండ్లపై సూర్యాపేట నుండి పెద్ద ఎత్తున బయల్దేరి వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వస్తున్నరు రైతన్నలు అని చెప్పారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం 2000 మందిని వాలంటీర్లుగా నియమించి, సభ దగ్గర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం అన్నారు. శూన్యం నుంచి సునామీని సృష్టించి లక్ష్యాన్ని చేరుకున్న అసాధారణ నేత కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ మాత్రమే రాజీ పడకుండా కొట్లాడి తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతుంది. కాబట్టి పార్టీ తిరిగి అధికారంలోకి రావాలనే భావన ప్రజల్లో బలంగా ఉందని తెలిపారు.
Also Read:ఆటా ఆధ్వర్యంలో ధరిత్రి దినోత్సవం
ప్రజలు బీఆర్ఎస్ సభు స్వచ్ఛందంగా తరలివస్తున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలదే హవా అని.. తమకు ఎదురైంది తాత్కాలిక ఎదురుదెబ్బ మాత్రమేనని, తిరిగి ప్రజాదరణ పొందుతామని చెప్పారు.

