లక్ష మంది సినీ కార్మికులకు అమితాబ్ సాయం..

315
big b
- Advertisement -

దేశవ్యాప్తంగా కరోనా ప్రభావంతో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో అన్నీ బంద్ అయిపోయింది. ఇక దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమలు బంద్ చేశారు. దీంతో ఈ సినీ పరిశ్రమపై ఆధారపడ్డ కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డారు. వారికి తిండికి లేని పరిస్థితి ఎదురైంది. ఈ నేపథ్యంలో సినీ కార్మికులను ఆదుకునేందుకు చిరంజీవి ఇంకా ప్రముఖ టాలీవుడ్ అగ్రహీరోలు మందుకొచ్చి కరోనా క్రైసిస్‌ చారిటీ సంస్థను ఏర్పాటు చేసి వారికి సేవ చేస్తున్నారు.

తాజాగా కరోనా వైరస్‌పై చేస్తున్న పోరాటంలో సాయం చేసేందుకు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ముందుకొచ్చారు. తన వంతుగా లక్ష కుటుంబాలకు సాయం చేస్తానని ప్రకటించారు. ఆల్ ఇండియా ఫిల్మ్ ఎంప్లాయిస్ కాన్ఫెడరేషన్‌లో సభ్యులుగా ఉన్న లక్షమంది దినసరి సినీ కార్మికుల కుటుంబాలకు నెలవారీ రేషన్‌ను అందిస్తామని బిగ్‌ బీ చెప్పారు.

అమితాబ్ చేపట్టిన ఈ కార్యక్రమానికి సోనీ పిక్చర్స్ నెట్ వర్క్, కల్యాణ్ జ్యువెల్లర్స్ అండగా నిలుస్తున్నాయి. ఈ విషయాన్ని సోనీ పిక్చర్స్ నెట్‌ వర్క్ ధ్రువీకరించింది. దేశ వ్యాప్తంగా ఉన్న లక్ష మంది ఫిల్మ్, టెలివిజన్ కార్మికుల కుటుంబాలకు సాయం చేస్తామని ప్రకటించింది. అయితే, ఆ కుటుంబాలకు ఎప్పటి నుంచి రేషన్ సరుకులు అందిస్తారన్న విషయం మాత్రం వెల్లడి కాలేదు. సోనీ పిక్చర్స్ తరఫున కనీసం యాభై వేల మంది కార్మికులు, వారి కుటుంబాలకు ఒక నెల సరుకులు ఇస్తామని ఆ సంస్థ సీఈవో ఎన్పీ సింగ్ తెలిపారు.

- Advertisement -