హైదరాబాద్ సమీపంలోని జీఎంఆర్ ఇండస్ట్రీయల్ పార్కు వద్ద కొత్తగా ఏర్పాటు చేయనున్న ష్నీడర్ ఎలక్ట్రిక్ కంపెనీ శంకుస్థాపనకు హాజరై భూమిపూజ చేసిన మంత్రి కేటీఆర్. రూ.300 కోట్లతో ఏర్పాటు కాబోతున్న ఈ కంపెనీ…ప్రభుత్వంతో కలిసి స్థానిక యువతకు శిక్షణ ఇవ్వాలని కేటీఆర్ కోరారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. దేశంలోనే అతిపెద్ద ఫ్యాక్టరీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. స్మార్ట్ మ్యనుఫ్యాక్టరింగ్‌లో స్థానిక యువతకు శిక్షణ ఇస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. ఒకే రోజు హైదరాబాద్‌లో మూడు ఫ్రెంచ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇది సంతోషించే విషయమని పేర్కొన్నారు. మరిన్ని ఫ్రెంచ్ సంస్థలు హైదరాబాద్ వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాలని కేటీఆర్ కోరారు.
75 శాతం ష్నీడర్ ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయని తెలిపారు. ఏడాది లోపే సంస్థ తన నూతన ఫ్యాక్టరీని ప్రారంభించనుందని పేర్కొన్నారు.