భవిష్యత్ తాగునీటి అవసరాలు తీర్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు మంత్రి కేటీఆర్. ఎల్బీనగర్ కారిడార్‌లో చింతలకుంట చౌరస్తా వద్ద నిర్మించిన అండర్ పాస్,కండ్లకొయ వద్ద ఈ ఎక్స్‌ప్రెస్ వేను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ మౌలిక వసతులతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు.ఓఆర్‌ఆర్ చుట్టూ ఇంటర్ కనెక్టెడ్ గ్రిడ్ ఏర్పాటు చేసి.. హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేలా ప్రణాళికలు తయారు చేస్తామన్నారు.
త్వరలోనే నితిన్ గడ్కరీ చేతుల మీదుగా మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నామని చెప్పారు. నగరంలో ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని … అందులో భాగంగానే ఎస్‌ఆర్‌డీపీ కింద అండర్‌పాస్‌లు నిర్మిస్తున్నామని చెప్పారు. స్కైవేల కోసం డిజైన్ల బడ్జెట్ సిద్ధంగా ఉందన్నారు. ఒఆర్‌ఆర్ చుట్టు ఇంటర్ కనెక్టెడ్ గ్రిడ్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
కండ్లకోయ వద్ద 1.10 కిలోమీటర్ల పొడవు గల ఈ ఎక్స్‌ప్రెస్‌వేను రూ. 125 కోట్ల వ్యయంతో నిర్మించారు. కండ్లకోయ జంక్షన్ పూర్తవడంతో 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు అందుబాటులోకి వచ్చింది. ఎల్బీనగర్ కారిడార్‌లో భాగంగా చింతలకుంట చౌరస్తా వద్ద నిర్మించిన అండర్‌పాస్‌ను రూ. 18.70కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ అండర్‌పాస్‌తో విజయవాడ హైవేపై ట్రాఫిక్ ఇబ్బందులు చాలావరకు తగ్గనున్నాయి. ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా అందుబాటులోకొచ్చిన ప్రాజెక్టులో ఇది మూడవది.
Municipal Administration Minister @KTRTRS inaugurated the newly constructed underpass at Chintalkunta Checkpost along with Mayor @bonthurammohan and other dignitaries. pic.twitter.com/rbmaC7QdRK
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) May 1, 2018