‘మహానటి’ ఆడియో ఈవెంట్‌.. గెస్ట్ ఈయనే

220
NTR chief guest for Mahanati audio launch..
- Advertisement -

అలనాటి నటి సావిత్రి….తన నటనతో, అభినయంతో అన్ని భాషల్లో నటించి నట శిఖరంగా ఎదిగింది. అలనాటి ప్రముఖలు హీరోలతో నటించి నటనకు అర్థం చెప్పింది సావిత్రి. అలాంటి మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్నచిత్రం ‘మహానటి’. ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై ప్రియాంకాదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

NTR chief guest for Mahanati audio launch..

 

ఈ సినిమాలో సావిత్రి భర్త జెమిని గణేశన్ పాత్రలో మలయాళ కథానాయకుడు దుల్కర్‌ సల్మాన్ నటిస్తున్నారు. సావిత్రి పాత్రలో కీర్తీసురేష్ నటించగా సమంతా జర్నలిస్ట్‌గా నటిస్తుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ పాత్రలో కనిపించన్నాడు. ఈ సినిమకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతుండగా ప్రమోషన్‌లో జోరుగాసాగుతుంది. ఈ సినిమాకు సంబంధించిన పాటతో పాటు పొస్టర్లను ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ సినిమాపై అంచనాలను పెంచే పడంది చిత్ర యూనిట్. ఇప్పటికే విడుదలై టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది.

NTR chief guest for Mahanati audio launch..

అయితే ఇక విషయానికొస్తే మిక్కీ జె మేయర్‌ సంగీతం అందించిన ఈ సినిమా పాటల వేడుక ఈ రోజు జరగనుంది. ఇ ఈవెంట్‌కు ముఖ్య అతిధిగా జూ. ఎన్టీఆర్ గెస్టుగా వస్తున్నారని చిత్ర నిర్మాత స్వ‌ప్న ద‌త్‌ ట్విట్టర్‌లో తెలిపారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -