- Advertisement -
హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో స్విట్జర్లాండ్‌కు చెందిన ఫెర్రింగ్ ఔషధరంగ సంస్థ ఏర్పాటు చేసిన ఫెర్రింగ్ ఫార్మాస్యూటికల్స్‌ను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి సోమవారం కేటీఆర్ ప్రారంభించారు. దాదాపు 30 మిలియన్ యూరోల పెట్టుబడితో ఈ యూనిట్ ను ఏర్పాటు చేశారు.
ఫెర్రింగ్ ఫార్మా పునరుత్పత్తి ఔషధాలు, ప్రసూతి ఆరోగ్యం, గ్యాస్ట్రోఎంటరాలజీ మరియు యూరాలజీ వంటి ప్రత్యేక విభాగాలలో అగ్రగామిగా ఉన్నది. ఫెర్రింగ్ గత 50 సంవత్సరాలుగా మాతా, శిశువులకు సంబంధించిన ఔషధాలను అభివృద్ధి చేస్తున్నది.
- Advertisement -

