దేశంలోనే హైదరాబాద్ బెస్ట్ సిటీ- మంత్రి కేటీఆర్

113
- Advertisement -

హైదరాబాద్‌లో మాదాపూర్‌ హైటెక్స్‌లో జరుగుతున్న క్రెడాయ్‌ ప్రాపర్టీ షోను మంత్రి కేటీఆర్‌ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కరెంట్ లేదు, నీళ్లు లేవని విమర్శించారు. ఏపీలోని రోడ్లన్నీ అధ్వాన్నంగా ఉన్నాయని అన్నారు. ఏపీలోని సొంతూళ్లకు వెళ్లొచ్చిన తన మిత్రులు ఈ విషయాన్ని తనతో చెప్పారని… ఏపీలో ఉంటే నరకంలో ఉన్నట్టు ఉందంటున్నారని వ్యాఖ్యానించారు. బెంగళూరులోని కంపెనీలు కూడా ఏపీలోని అధ్యాన్నపు రోడ్ల గురించి మాట్లాడుతున్నాయని అన్నారు.

తెలంగాణ చాలా ప్రశాంతమైన రాష్ట్రమని.. దేశంలోనే హైదరాబాద్ బెస్ట్ సిటీ అని చెప్పారు. తెలంగాణలో అభివృద్ధి ఎలా ఉందో ఏపీ ప్రజలకు అర్థమైందని తెలిపారు. నగరాల్లో మౌలిక సదుపాయాలను ఎప్పటికప్పుడు అభివృద్ధి చేయకపోతే వెనుకపడిపోతామని అన్నారు. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో హైదరాబాద్‌ దూసుకుపోతున్నదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. దేశంలోని మిగతా మెట్రో నగరాల కంటే ఎంతో ముందున్నదని చెప్పారు.

హైదరాబాద్‌లో నిర్మాణ రంగానికి ఎలాంటి ఢోకాలేదన్నారు. మరో 10 నుంచి 15 ఏండ్లు హైదరాబాద్‌కు ఢోకాలేదని స్పష్టం చేశారు. కొన్ని కంపెనీల కుమ్మక్కు వల్లే స్టీల్‌, సిమెంటు ధరలు పెరిగాయని, ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. త్వరలో ఫార్మా సిటీని ప్రారంభిస్తామన్నారు..

- Advertisement -