విభజన హామీలు నెరవేర్చండి:కేటీఆర్

269
KTR
- Advertisement -

విజభన చట్టంలోని హామీలను నేరవర్చాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీని కోరారు మంత్రి కేటీఆర్. ఢిల్లీలో ప్రధానితో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్ పెండింగ్ లో ఉన్న సమస్యలను మోడీకి వివరించారు.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్ మెంట్ రీజియన్ (ఐటీఐఆర్) ఏర్పాటును వేగవంతం చేయాలని ప్రధాని మోడీని కోరామని తెలిపారు. ఐటీఐఆర్‌కు కేంద్రం సహకరిస్తే మరింత వేగంగా ముందుకెళ్తామని ప్రధానికి తెలిపామన్నారు. బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అనేది తెలంగాణ ప్రజల ఆకాంక్ష, హక్కుగా గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని.. కేంద్రం భాగస్వామ్యం కావాలని కోరారు.

KTR

బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే 15 వేల మంది గిరిజనులకు ఉపాధి కల్పించొచ్చని మోడీకి తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరినట్లు తెలిపారు. హైకోర్ట్ విభజనను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కోరినట్లు తెలిపారు కేటీఆర్.

- Advertisement -