- Advertisement -
దేశ వ్యాప్తంగా 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈసందర్భంగా హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు . తెలంగాణ భవన్ కు చేరుకున్న కేటీఆర్ మొదట తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాలలు వేశారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు.
ఈ వేడుకల్లో మంత్రులు మహముద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డితో పాటు పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక మున్సిపాలిటీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన నేపథ్యంలో కేటీఆర్ కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -