- Advertisement -
సూరత్‌లో ఉన్న తెలంగాణ వాళ్లకు అండగా నిలిచారు మంత్రి కేటీఆర్. గుజరాత్‌లోని సూరత్ పట్టణంలో 55 రోజులుగా కష్టాలు పడుతున్నామని 34 మంది వలస కూలీలు ట్విట్టర్ ద్వారా తమ సమస్యను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు.
తిండిలేక అల్లాడుతున్నాం, డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాం, దయచేసి బస్సులు నడిపి తమను ఇండ్లకు పోయేలా చేయండని విజ్ఞప్తిచేశారు.
దీంతో వెంటనే స్పందించిన కేటీఆర్.. అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి వారిని స్వస్థలాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించారు.
We will take care @KTRoffice work with local authorities through @TelanganaDGP office and arrange for transportation. https://t.co/MIkWJpi2vC
— KTR (@KTRTRS) May 16, 2020
- Advertisement -