సరస్వతీ పుత్రునికి కేటీఆర్‌ సాయం..

754
- Advertisement -

సరస్వతీపుత్రునికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సహాయాన్ని టీఆర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అందించారు. పేదరికాన్ని జయించిన సరస్వతి పుత్రుడు ఏంపటి కుష్వంత్‌కు రాష్ర్ట ప్రభుత్వం నుంచి ఐదు లక్షల సహయాన్ని ముఖ్యమంత్రి మంజూరు చేశారు. కుష్వంత్ కుటుంబం మంచిర్యాల జిల్లా శ్రీరాంపురంలో ఉండేది. కొన్ని నెలల క్రితం అనిత భర్త లక్ష్మీనారాయణ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో భూపాలపల్లికి బతుకు తెరువు కోసం వచ్చారు. ప్రస్తుతం భూపాలపల్లిలో కుట్టు మిషన్ పనిచేస్తు తన కుమారులను పోషిస్తున్నది. అనిత కుమారుడు కుష్వంత్ తెలంగాణ ఎంసెట్‌లో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించడంతో పాటు జాతీయ స్థాయి నీట్ పరీక్షలో 50వ ర్యాంక్ సాధించడం జరిగింది.

ktr

దీనితో పాటు ఏపీ ఎంసెట్‌లోనూ ఎనిమిదవ ర్యాంకు సాధించాడు. ఈ మేరకు డీల్లీ ఏయిమ్స్‌లో సీటు వచ్చింది. అయితే కుట్టు పనిచేసే తన తల్లి, కుష్వంత్ ఉన్నత చదువులకు అవసరం అయిన ఫీజులను భరించలేని నేపథ్యాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న కేటీఆర్ సహాయం అందిస్తామని హమీ ఇచ్చారు. ఈ మేరకు కుష్వంత్ పరిస్థితిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయించారు. ఈ రోజున మంత్రి శ్రీనివాస్ గౌడ్, భూపాలపల్లి జిల్లా పరిషత్ చైర్మపర్సన్ గండ్ర జ్యోతి సమక్షంలో ఈ రోజు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వచ్చిన 5 లక్షల చెక్కును కేటిఆర్ అందించారు.

ktr

అలాగే కేటీఆర్‌ మరో ఇద్దరు విద్యార్దులకు సొంతంగా అర్ధిక సహాయం అందించారు. జాతీయ పోటీ పరీక్ష అత్యుత్తమ కనబర్చిన విద్యార్దిని ఫీజులకు అవసరం అయిన అర్ధిక సహాయం అందించారు. నేషనల్ ఇస్టిట్యూట్ అప్ న్యూట్రిషన్ పోటీ పరీక్షలో దేశ వ్యాప్తంగా మొదటి ర్యాంకు సాధించిన కె.లావణ్య ఫీజుకు అవసరం అయిన అర్ధిక సహాయం అందించారు. మెడ్చేల్ జిల్లాలోని గాజుల రామారంకు చెందిన కె. లావణ్య తండ్రి స్ధానికంగా ఉన్న ఒక కంపెనీలో రోజువారీ కూలీగా పనిచేస్తున్నారు. తన తల్లిదండ్రులు పేదరికం వలన తనఫీజులు చెల్లించలేక పోతున్నానని కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా తన సమస్యను తెలిపింది. ఈమేరకు కేటీఆర్‌ అమెకు అవసరం అయిన ఫీజుల తాలుకు అర్ధిక సహాయం అందించారు.

అదేవిధంగా మరో పేద విద్యర్థికి కేటీఆర్‌ సహాయం అందించారు.సిరిసిల్లా జిల్లా పట్టణం, సుందరయ్య నగర్‌కు చెందిన యస్.పవన్ ఫ్రీ సీటు సాధించి వియన్ అర్ విజ్ఝాన జ్యోతి కళాశాలలో మూడవ సంవత్సరం బిటెక్ చదువుతున్నారు. తన తండ్రి చిన్న టీ కోట్టు ద్వారా జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ ఫీజుల కోసం అవసరం అయిన సహాయాన్ని ఆయన అందించారు.

- Advertisement -