హజ్ యాత్రకు జెండా ఊపిన హోంమంత్రి..

401
mahmood ali
- Advertisement -

మంత్రులు మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, తలసాని నివాస్ యాదవ్ హజ్ యాత్రికుల బస్‌ను నేడు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ ఇతర ముస్లిం మైనారిటీ శాఖ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ..హజ్ యాత్రికులకు శుభాకాంక్షలు, తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది.ముస్లింలకు గొప్ప కార్యక్రమాలు చేపడుతున్నారు మన సీఎం కేసీఆర్.అన్ని మతాలను గౌరవించే ఏకైక సీఎం కేసీఆర్ అని అన్నారు.ముస్లిం విద్యార్థులకు ఇతర దేశాలలో చదువుకునేందుకు ఓవర్సీస్ విద్య ద్వారా స్కాలర్ షిప్ అందిస్తున్నాం.దేశంలోనే గోప్ప సీఎం కేసీఆర్. సిద్దిపేటలో కూడా ముస్లింలకు హజ్ నిర్మించాం అన్నారు.

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ దేశంలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. ముస్లిం మైనారిటీ లకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు.ముస్లింల పిల్లలకు మైనార్టీ స్కూల్స్, నిరుద్యోగ యువతకు సబ్సిడీపై వాహనాలు ఇలా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. షాది ముబారక్ కార్యక్రమం ఒక్క గొప్ప కార్యక్రమం ముస్లిం పేద అడబిడ్డలకు ఒక్క వరం మంత్రి తలసాని తెలిపారు. హజ్ యాత్రను విజయవంతం చేసుకొని రావాలని కోరుకుంటున్నాను అని ఆయన అన్నారు.

డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ మాట్లాడుతూ.. ముస్లింలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు మన సీఎం కేసీఆర్. దేశంలోనే మన రాష్ట్రంలో మైనార్టీలకు సీఎం కేసీఆర్ గొప్ప పథకాలు ప్రవేశపెట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో కనీసం మనను పట్టించుకోలేదు ప్రభుత్వం అన్నారు. ఈ సందర్భంగా హజ్ యాత్రికులకు శుభాకాంక్షలు తెలిపారు.

మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. హజ్ యాత్రికులకు సోదరి సోదరీమణులకు శుభాకాంక్షలు.హజ్ యాత్రకు చాలా మంది వెళ్తున్నారు,ప్రతి సంవత్సరం హజ్ యాత్రికుల సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి గొప్ప కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పూర్తి స్థాయిలో అన్ని విధాలా ఏర్పాట్లు చేస్తున్నారని మంత్రి అన్నారు. ముస్లింల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. హజ్ యాత్రకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు, దేశంలో ఎక్కడ లేనివిధంగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. అన్ని మతాల పండుగలను గౌరవిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని సౌకర్యాలు కల్పించారు, మీరు విజయవంతంగా యాత్ర ముగించుకొని రాష్ట్ర ప్రభుత్వం మరింత ముందుకు నడిపేలా అల్లాను కోరుకోవాలని కోరుకుంటున్నాను అని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు.

- Advertisement -