ఇసుక అక్రమార్కులపై సర్జికల్ స్ర్టయిక్స్

185
- Advertisement -

ఇసుక అక్రమరవాణపై ఉక్కుపాదం మోపుతామని మైనింగ్ శాఖ మంత్రి కెటి రామారావు తెలిపారు. సహజ వనరులు ప్రజల ఆస్తి అని దాన్ని కొంతమంది అక్రమార్కులు తమ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని అలాంటి వారిపై చర్యలు తప్పవని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇసుకను తక్కువ ధరకు, అందరికీ అందుబాటులో ఉంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ మేరకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు కేటీఆర్.

కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన కేటీఆర్ ఇసుక విక్రయాల ద్వారా గత రెండు సంవత్సరాల్లో గణనీయమైన రాబడి నమోదైందని గుర్తుచేశారు.  పరిమితికి మించి ఒవర్ లోడ్తో వెళ్లే వాహనాలు, వే బిల్లుల అక్రమాలపైన దృష్టి సారించాలని మంత్రి అధికారులను అదేశించారు. అంతరాష్ర్ట సరిహద్దులున్న జిల్లాల్లోని అధికార యంత్రాంగం మరింత క్రీయాశీలంగా పనిచేయాలని మంత్రి సూచించారు. ఇతర రాష్ర్టాల్లోంచి ఇసుకను అక్రమంగా తరలించే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు.

KTR held video conference on Mining

జిల్లాల్లో అవసరం ఉన్న ప్రాంతాల్లో వే బ్రిడ్జిలను ఎర్పాటు చేస్తామని, ఇందుకోసం ప్రతిపాధనలకు ప్రభుత్వానికి పంపాలన్నారు. స్థానిక అవసరాలకు ఇసుక వినియోగానికి తాము సహకరిస్తామన్న మంత్రి, ఈ పేరుతో అక్రమంగా ఇసుకను డంపుల్లో నిల్వ చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇందుకోసం వాడే వాహనాలను వేంటనే సీజ్ చేయాలని, జరిమానాలను భారీగా వేయాలన్నారు. అక్రమ రవాణాలో దొరికే వాహనాల నంబర్లను బ్లాక్ చేస్తామని, ఇలాంటి వాహణాల్లో ఇకపై యండిసి ఇసుక రవాణాకు అనుమతించదన్నారు. దీంతోపాటు ఇప్పటి దాకా అక్రమ రవాణ చేస్తున్న డ్రైవర్లపైననే కేసులు నమోదు చేసేవారని, ఇకపైన వాహన యజమానులపైనా కేసులు నమోదు చేస్తామన్నారు.

ఇసుక రవాణాను అడ్డుకునేందుకు పోలీసు, రెవెన్యూ, మైనింగ్ శాఖాధికారులతో సంయుక్తంగా టీంలను ఏర్పాటు చేసుకుని పనిచేయాలన్నారు. ఈ టీముల్లోని సభ్యులను ఎప్పటికప్పుడు రోటేషన్ పద్దతిన మార్చాలని సూచించారు.  ఈ టీంలను ఏర్పాటు చేసి విజయవంతంగా అక్రమ రవాణాను అడ్డుకుంటున్న పలువురు కలెక్టర్ల చొరవను మంత్రి అభినందించారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఇసుక రవాణా కోరకు  చేపట్టిన సాండ్ ట్యాక్సీ ప్రయోగాన్ని అభినందించిన మంత్రి, ఇలాంటి మాడల్‌ను ప్రతి జిల్లాలోనూ అమలు చేసేందుకు ప్రయత్నించాలని కలెక్టర్లకు అదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అధికారికంగా ఒక సర్య్కూలర్‌ను టియస్ యండిసి జారీ చేస్తుందన్నారు.

ఇసుక రవాణాలో అక్రమాలను అరికట్టేందుకు జిల్లాకో ప్రత్యేక అధికారిని వేసుకునే అధికారం కలెక్టర్లకున్నదని, ఈ అంశాన్ని ఉపయోగించుకుని పక్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో పోలీసు అధికారులు సైతం మరింత  చురుగ్గా వ్యవహరించాలని మంత్రి జిల్లా యస్పీలకు అదేశాలు జారీ చేశారు. జిల్లాలోని అర్టీఏ చెక్ పొస్టులను సైతం ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు వినియోగిస్తామని రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు.  ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -