వారంలోగా 4 లక్షల రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు : మంత్రి కేటీఆర్

125
ktr
- Advertisement -

ప్రభుత్వ ఆసుపత్రులకు వారంలోగా 4 లక్షలకుపైగా రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు అందేలా చూస్తామని మంత్రి శ్రీ కేటీఆర్‌ తెలిపారు. బుధవారం రెమిడెసివిర్‌ ఉత్పత్తిదారులతో మంత్రి కేటీఆర్‌ చర్చలు జరిపారు. సీఎం ఆదేశాల మేరకు ఉత్పత్తిదారులతో చర్చించినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో రెమిడెసివిర్‌ ఇంజక్షన్ల కొరత పెరిగింది. వైరస్ సోకి శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు తలెత్తుతున్న వారికి వైద్యులు ఆక్సిజన్‌తోపాటు రెమిడెసివిర్ ఇంజక్షన్‌లను ఇస్తున్నారు.

ఫలితంగా వైరస్ లోడ్ తగ్గి రోగులు త్వరగా కోలుకుంటున్నట్టు చెబుతున్నాయి. ఇటీవల ఆస్పత్రుల్లో చేరుతున్న రోగుల సంఖ్యతో పాటే రెమిడెసివిర్ ఇంజక్షన్ల వినియోగం సైతం పెరిగింది. ఉత్పత్తి తగ్గడం.. చాలాచోట్ల ఇంజక్షన్లు లభించకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఉత్పత్తి పెంచాలని తయారీ సంస్థలతో మంత్రి కేటీఆర్‌ ఇవాళ చర్చలు జరిపారు.

- Advertisement -